![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -290 లో......జ్యోత్స్న, కార్తీక్ వాళ్ల దగ్గరికి వచ్చి రెస్టారెంట్ కి కస్టమర్స్ రాకుండా చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు దాస్ దగ్గరికి డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు. మళ్ళీ ఏదైనా పేపర్ పై రాస్తున్నాడా అని అడుగుతాడు. ఏం లేదని స్వప్న, కాశీలు డాక్టర్ కి చెప్తారు. ఆ తర్వాత డాక్టర్ వెళ్ళిపోయాక బెడ్ కింద స్వప్నకి ఒక పేపర్ కన్పిస్తుంది. అందులో దీపం వెళుగుతున్నట్లు ఉండే బొమ్మ గీసి ఉంటుంది. మావయ్య గారు ఇది ఎందుకు రాసారని స్వప్న అంటుంది.
ఇది వరకు కొన్ని పదాలు రాసాడు కదా.. వాటికి వీటికి జత చేసి చూద్దామని స్వప్న అంటుంది. అలా స్వప్న చెప్తుంటే నాన్న గుర్తులేక ఏదో ఒకటి రాస్తే నువ్వు ఇలా చెప్తున్నావని కాశీ అంటాడు.ఆ తర్వాత శౌర్యా అద్దంలో చూసుకుంటూ నేను చాలా బాగున్నా కదా అంటుంది. అవును మీ అమ్మ చిన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదని అనసూయ అంటుంది. దాంతో శౌర్య, దీప చిన్నప్పటి ఫోటోని చూసి ఇది నాన్నకి చూపిస్తాను అంటూ వెళ్తుంది. కార్తీక్ కాంచన తో మాట్లాడుతుంటే.. శౌర్య వెళ్తుంది. కార్తీక్ బాబు ని విసిగించకని దీప వెనక్కి పంపిస్తుంది. శౌర్య ఫోటో గదిలో పడేస్తుంది. కార్తీక్ కాలికి తగులుతుంది. ఫోటో తీస్తాడు.. చూడబోతుంటే అప్పుడే కార్తీక్ కి ఫోన్ వస్తుంది. ఫోటో చూడడు. మరుసటి రోజు కార్తీక్ రెస్టారెంట్ కి జ్యోత్స్న వస్తుంది. జ్యోత్స్న వచ్చేసరికి కార్తీక్ రెస్టారెంట్ కస్టమర్స్ తో నిండిపోతుంది. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది.
చాలా థాంక్స్ సీఈఓ గారు మీ వల్లే మా రెస్టారెంట్ కి జనాలు ఎగబడ్డారంటూ ముందు రోజు కార్తీక్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడిన మాటలు జ్యోత్స్నకి వీడియో చూపిస్తాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. జ్యోత్స్న రెస్టారెంట్.. సీఈఓ సత్య రాజ్ రెస్టారెంట్ లో అంటూ టైటిల్ అంటూ కార్తీక్ చూపిస్తాడు. మీకు ఇలా చెయ్యడం సిగ్గు అనిపించడం లేదా అని జ్యోత్స్న కోప్పడుతుంది. ఈ వీడియో మేం తియ్యలేదు ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టారని కార్తీక్ అనగానే.. జ్యోత్స్న కోపంగా వెళ్తుంది. జ్యోత్స్న ఇంటికి వెళ్లేసరికి శివన్నారాయణ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. అబ్బాయితోనే డైరెక్ట్ కార్తీక్ గురించి జ్యోత్స్న చెప్పేస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |